అజిత్‌కు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ కాజల్‌కు ఈమధ్య ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న మూడు సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో కాస్త నిరాశ చెందింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో నటించిన ‘దో లఫ్జోంకి కహాని’ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో ఇక దక్షిణాదిపై ఫోకస్ పెట్టినట్టుంది. ప్రస్తుతం ఆమెకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళ స్టార్ హీరో అజిత్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అజిత్ హీరోగా నటిస్తున్న ‘తల-57’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాల్లో వుంది. ప్రస్తుతం కాజల్ జీవా సరసన ‘కావలైవెండమ్’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో రానా సరసన మరో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.