మరో ఖల్‌నాయక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1993లో వచ్చిన ఖల్‌నాయక్ చిత్రం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. సంజయ్‌దత్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శక నిర్మాత సుభాష్‌ఘై తెరకెక్కించారు. 23 ఏళ్ళ తరువాత ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నేటి తరానికి తగ్గట్టుగా రీమేక్ చేస్తానని సుభాష్‌ఘై ఆమధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. మూడేళ్ళ క్రితమే ప్రకటించినా ఇప్పటివరకూ సినిమా ప్రారంభం కాలేదు. ఇపుడు ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసుకున్నారు. ఈ చిత్రంలో ఖల్‌నాయక్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తారని తెలిసింది. ఇటీవలే బాజీరావు మస్తానీ చిత్రంతో తనదైన సత్తాచాటుకున్న రణ్‌వీర్ ఖల్‌నాయక్ పాత్రకు కరెక్టుగా సూట్ అవుతాడని అంటున్నాడు సంజయ్‌లీలా భన్సాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తికావచ్చిందని, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకొస్తారని ప్రకటించారు.