నిద్రలేని రాత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఝమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ తాప్సీకి చాలా అవకాశాలు వచ్చినా కూడా తెలుగులో సరైన కమర్షియల్ హిట్‌ని అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, అక్కడ చేసిన మూడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తాప్సీకి అనుభవం బాగా వచ్చినట్టుంది. అందుకే ఎక్కడ చూసినా తన అనుభవాన్ని రంగరించి మాట్లాడుతోందట. తాజాగా ఓ కార్యక్రమంలో ఈమె సినిమాల గురించి చెబుతూ, పరిశ్రమలో ఒక్కసారి ఏ భాషలోనైనా నటనలో తప్పుచేస్తే దాంతో ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితే వస్తుంది. కాబట్టి స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో ఆచి తూచి జాగ్రత్తపడాలని, ఒకవేళ మొదట్లోనే తనకు ఆ స్క్రిప్ట్‌పై నమ్మకం లేకపోతే ఆ సినిమా చేయనని, స్క్రిప్ట్ దశలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. అంతేకాదు, తను నటించిన సినిమా విడుదలైన రోజు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిందట. తన ప్రతి సినిమా విడుదల తనకు పరీక్షల ఫలితాల్లా వుంటాయని చెప్పింది.