కలెక్షన్లలో సుల్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే బాలీవుడ్ కలెక్షన్ల రికార్డును అధిగమించింది. షారుక్‌ఖాన్ నటించిన ‘్ఫ్యన్’ చిత్రం ఇప్పటివరకు తొలిరోజు కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలవగా, ‘సుల్తాన్’ చిత్రం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ ఏడాది తొలి రోజు వసూళ్లలో సుల్తాన్ చిత్రం సల్మాన్‌ఖాన్ సినిమాలలోనే కలెక్షన్ల పరంగా నెం.2గా నిలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘ప్రేమ్త్రన్ ధన్‌పాయో’ 40.35 కోట్లు వసూలు చేసి ప్రథమ స్థానంలో వుంది. తరువాతి స్థానం ఇప్పుడు విడుదలైన సుల్తాన్ (36.54 కోట్లు) నిలిచింది. ఏక్‌థా టైగర్ (32.93కోట్లు), భజరంగి భాయిజాన్ (37.25కోట్లు), కిక్ (26.40కోట్లు) వసూలు చేసి సల్మాన్ ఖాన్ సినిమాల స్టామినాను నిరూపిస్తున్నాయి.