ఏలియన్స్‌పై సినిమా తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడ్రన్ సినిమా బ్యానర్‌పై ఆదిత్య ఓం స్వీయ దర్శక నిర్మాణంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదిత్య ఓం ప్రత్యేక పాత్రలో నటించారు. రోహిత్, ప్రకాష్, శీతల్, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్‌కర్, నితేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఆదిత్య ఓంతో ఇంటర్వ్యూ...
సోషల్ మీడియా నేపథ్యంతో..
ముఖ్యంగా ఈ రోజు యువత ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. దీనివల్ల వారి సైకాలజీ, బిహేవియర్‌లో చాలా మార్పులు వచ్చాయి. దీన్ని బేస్ చేసుకుని ఎంటర్‌టైన్‌మెంట్, హారర్ ప్రధానాంశాలుగా రూపొందించిన చిత్రమే ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమాను స్టార్ట్ చేశాను. అప్పటివరకు సోషల్ మీడియావల్ల నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాను. దీని ద్వారానే నాకు ఈ సినిమా ఆలోచన వచ్చింది.
ఘోస్ట్ సైకాలజిస్ట్ పాత్రలో..
ఈ చిత్రంలో నేను ఘోస్ట్ సైకాలజిస్ట్ అనే స్పెషల్ క్యారెక్టర్‌లో నటించాను. సినిమాలో నా క్యారెక్టర్ వ్యవధి 25 నిమిషాలు మాత్రమే వుంటుంది. అయితే సీరియస్‌గా సాగే సినిమాలో నా పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా మారుస్తూ అక్కడి సమస్యలను పరిష్కరించే రోల్. ఈ క్యారెక్టర్ కోసం వేరే నటులను అనుకున్నాం కాని చివరకు విజయ్ వర్మగారి సలహా మేర ఈ క్యారెక్టర్‌ను నేనే చేయాలనుకున్నాను. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాం. ప్రతి సీన్‌ను రెండు వేర్వేరుగా చిత్రీకరించాం. అయితే తెలుగులో ముందుగా విడుదలవుతోంది. నాలాంటి దర్శక నిర్మాతలకు హిందీలో సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ సక్సెస్ అయిన తరువాత అక్కడ రిలీజ్ చేయడం చాలా సులభమవుతుంది. అయితే హిందీ వెర్షన్‌లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలవుతుంది.
గ్లామర్ కోసం కాదు..
సినిమాలో గ్లామర్ కోసం ఎక్కువమంది హీరోయిన్స్‌ను తీసుకున్నారేమో అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన అమ్మాయి ఫేస్‌బుక్ బానిసలా మారుతుంది. ప్రపంచంలో అందరితో చాటింగ్ చేస్తూంటుంది. తను ఓ పార్టీకి తన ఫ్రెండ్స్‌ను పిలుస్తుంది. దీనికోసం దేశంలోని వివిధ ప్రాంతాల వెరైటీని చూపించే అమ్మాయిలను చూపించామంతే. ప్రతి సన్నివేశం క్యారెక్టర్ కథలో భాగంగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హారర్ అంటే మినిమమ్ బడ్జెట్‌లో బాగా రూపొదించగల జోనర్. నేను కూడా మంచి కమర్షియల్ సినిమాను మినిమమ్ బడ్జెట్‌లో రూపొందించుకోవాలనుకోగానే హారర్ జోనర్‌లోనే చేయాలనుకున్నాను.
తదుపరి ప్రాజెక్ట్..
చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తెలుగులో నేటివిటీలో మొదటిసారి ఓ ఏలియన్ సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకోసం స్క్రిప్ట్ తయారుచేస్తున్నాను. అన్ని ఎలిమెంట్స్ అనుకున్నట్లు కుదిరితే తెలుగులో నేను చేసేదే మొదటి ఎలియన్ మూవీ అవుతుంది.

- శ్రీ