తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరా ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుందనపుబొమ్మ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది అచ్చతెలుగమ్మాయి చాందినీ చౌదరి. సుధాకర్ కొమ్మాకుల, సుధీర్‌వర్మ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.అనీల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్ చాందినీ చౌదరితో ఇంటర్వ్యూ...
ఛాన్స్ ఎలా వచ్చింది?
- మాది వైజాగ్. నేను చదువుకున్నదంతా బెంగుళూరులోనే. అక్కడే ఓ షార్ట్ ఫిలిం చేశాను. 2013లో ‘మధురం’ అనే షార్ట్ ఫిలిం చూసి ఈ సినిమా నిర్మాత నన్ను సంప్రదించారు. అప్పుడు నేను చదువుకుంటున్నాను. అలాగే సినిమా స్క్రిప్ట్ పనులు బిజీగా వుండడంవల్ల అది నాకు కలిసివచ్చింది. జనవరి 2015లో సినిమా ప్రారంభించారు.
మీ పాత్ర గురించి?
- ఇందులో నా పాత్ర పేరు సుచి. ఇంట్లో వున్నవాళ్లందరికీ తనంటే చాలా ఇష్టం. ఒక్కతే అమ్మాయి కాబట్టి గారాబంగా పెంచుకుంటారు. కొంచెం దర్పం, మంచి మనసున్న ఈ అమ్మాయికి కొన్ని సమస్యలుంటాయి. తన బావ గోపి, వాసు అనే వ్యక్తులు తన జీవితంలోకి ప్రవేశించడంవల్ల ఏం జరిగింది? ఆమె సమస్యలు ఎలా పరిష్కారం అయ్యాయనేది ఈ సినిమా.
కీరవాణి, రాఘవేంద్రరావు, వరా లాంటి వారితో పనిచేయడం ఎలా వుంది?
- నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా కథ బాగా నచ్చింది. నాలోని నటనను బైయటకు తీసే చిత్రమిది. ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు ఆనందంగా వుంది.
తెలుగమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు రావంటారు కదా? మీరేమంటారు?
- నిజమే. ప్రస్తుతం తెలుగమ్మాయిలను కాకుండా బయటినుండి హీరోయిన్లను తీసుకుంటున్నారు. ఎందుకో అర్థం కావడంలేదు. భాష తెలిసి డైలాగులు చెప్పేవారుండగా, వేరేవారిపై ఆధారపడటమెందుకు? ముఖ్యంగా తెలుగు హీరోయిన్లకంటే పరభాషా హీరోయిన్లకే ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కువ.
హీరోయిన్‌కంటే ముందు వేరే సినిమాలు చేశారా?
- ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ సిస్టర్ రోల్ చేశాను. కానీ అందులో చాలా సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయాయి. నిజానికి ఆ పాత్ర చేయాలా వద్దా అని అనుకున్నాను. కానీ శ్రీకాంత్ అడ్డాల ఒప్పించారు. నిజానికి సిస్టర్ రోల్స్ చేయడం ఇష్టం లేదు. హీరోయిన్‌గానే చేస్తా.
సినిమా రంగంలో ఎవరు ఇష్టం?
- నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఆయనను ఒకసారి కలవాలని వుంది. రజనీతో సినిమాలో నటించే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం లేదు.
తదుపరి చిత్రాలు?
- రాహుల్ రవీంద్రన్ హీరోగా రేవన్ యాదు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే, మధురం షార్ట్ ఫిలిం దర్శకుడు ఫణీంద్రతో మను అనే సినిమాలో నటిస్తున్నాను. దాంతోపాటు కన్నడలో కూడా అవకాశాలు వస్తున్నాయి. నాకు కన్నడ భాష కూడా తెలుసు. ఏదేమైనా మంచి సినిమా ఎక్కడ వచ్చినా చేస్తా.

- శ్రీ