గ్లామర్‌నే నమ్ముకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యామిలీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్, ‘డర్టీ పిక్చర్’ సినిమాతో ఒక్కసారిగా సంచలన తారగా మారిపోయింది. ఈ సినిమాతో తనలోనూ గ్లామర్ యాంగిల్ వుందని ప్రూవ్ చేసింది. ఆ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇమేజ్ తెచ్చిన విద్యాబాలన్, ఆ తరువాత రెండు మూడు సోలో చిత్రాలు చేసింది, అవి కూడా గ్లామర్‌కు దూరంగా. దాంతో ఈమె ట్రాక్ మార్చి చేసిన సినిమాలు పెద్దగా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి. దాంతో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ తన హవా క్రియేట్ చేసుకోవడానికి సిద్ధమైంది. బాలీవుడ్‌లో వెలగాలంటే గ్లామర్ తప్పనిసరి అని తెలుసుకున్నట్టు వుంది. అందుకే తాజాగా ఓ బెంగాలీ వేశ్య పాత్రలో నటించేందుకు ఓకె చెప్పింది. ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు, లిప్‌లాక్‌లు, వేడిపుట్టించే అంశాలు చాలా వుంటాయట. అవన్నీ చేయడానికి ఓకె చెప్పి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మొత్తానికి మళ్లీ గ్లామర్‌ను నమ్ముకున్న విద్యాకు ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి!