7న అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మీగౌతం ప్రధాన పాత్రలో జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ రూపొందించిన చిత్రం అంతం. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘అంతం’ చిత్రానికి ఇప్పటివరకు రాని అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సెన్సార్‌వారు ఎ సర్ట్ఫికేట్ అందించారని తెలిపారు. ‘గుంటూర్ టాకీస్’ చిత్రం ద్వారా మంచి నటన ప్రదర్శించిన రేష్మీగౌతంకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని, అన్ని రకాల రసాలు ఈ చిత్రంలో నటీనటులు ప్రదర్శించారని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోందని, ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని ఓ మంచి అనుభూతి పొందడం ఖాయమని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. చరణ్‌దీప్, వాసుదేవ్, సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, డి.ఐ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్.