జానూ నువ్వెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్‌జాదవ్, పవిత్ర, బ్రమిని ప్రధాన తారాగణంగా ఎస్.జె.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జానూ నువ్వెక్కడ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ప్రతి పాత్ర సరికొత్తగా ఉంటుందని, భావోద్వేగాల సమాహారంగా యువత మధ్య వచ్చే క్లిష్టమైన పరిస్థితులను సరికొత్తగా ఈ చిత్రంలో చూపించామని, నేటి యువత తమనుతాము ఈ కథలో ఊహించుకుంటారని అన్నారు. మురళీ లియోన్ అందించిన పాటలన్నీ హిట్ అయ్యాయని, ఇప్పుడొస్తున్న చిన్న సినిమాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని, సినిమా టైటిల్‌కు తగిన విధంగా పాటలన్నీ బాగా వచ్చాయని, ముఖ్యంగా యూత్‌ను ఎట్రక్ట్ చేసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మురళీలియోన్, నిర్మాతలు: దీపక్, సోహైల్ జిలానీ, దర్శకత్వం: సురేష్.