34 పాత్రలతో చల్‌చల్‌గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్‌చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహనప్రసాద్ మాట్లాడుతూ, కార్ రేసర్‌గా అనుభవం వున్న శైలేష్ ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని, మనసున్న ప్రేమికుడుగా శైలేష్ నటించిన ఈ చిత్రం యువతకు బాగా నచ్చుతుందని అన్నారు. మొత్తం 34 పాత్రలతో రూపొందిన ఈ చిత్రంలో ఒక పాత్రకు ఒక పాత్రకు ఏ విధమైన రక్తసంబంధం వుండదని, మానవ సంబంధాల విలువను తెలుపుతూ సరదాగా సాగిపోయే చిత్రం ఇదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టయ్యాయని, ప్రతి వారి ఫోన్లలో రింగ్‌టోన్‌గా మోగుతున్నాయని, ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలని సంగీత దర్శకుడు వెంగి అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: ఎం.రాఘవయ్య, సంగీతం: వెంగి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనప్రసాద్.