మహేష్-బాలయ్య మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ రేసులో ఉన్నాడు మహేష్. ఇక సీనియర్ హీరోల్లో చిరంజీవి తరువాత బాలయ్యే నెంబర్‌వన్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి? నిజంగా ఈ న్యూస్ అటు మహేష్ అభిమానులకు, ఇటు నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇప్పటికే వెంకటేష్‌తో మల్టీ స్టారర్ సినిమా చేసిన మహేష్ ఇప్పుడు బాలయ్య సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తాడని సమాచారం. సాయి కొర్రపాటి ఈ సినిమాకు జోరుగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే దర్శకుడు ఎవరనేది తెలుస్తుంది. నిజంగా ఈ సినిమా సెట్స్‌పైకి వస్తే మరో సంచలనమే అవుతుంది కదా!