ఐఫా హంగామాకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో గురువారం ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 17వ అవార్డుల ప్రదానోత్సవానికి అంతా సిద్ధమైంది. మాడ్రిడ్‌లోని హోలెక్స్ వేదికపై భారతీయ సినిమా దేదీప్యంగా వెలగనుంది. గురువారం నుంచి నాలుగురోజులపాటు సాగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్‌కు చెందిన తారలు పెద్దసంఖ్యలో ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. భారతీయ సినిమారంగంలో (హిందీ) విశేష ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో అవార్డుల ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం ఒకదేశంలో ఐఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ప్రపంచదేశాలకు భారతీయ సినిమా వైభవాన్ని చాటడమే ఈ వేడుక ఉద్దేశం. బాలీవుడ్‌లో ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం ఈ కార్యక్రమలంలో ముఖ్యమైన అంశమే అయినప్పటికీ మరో మూడు విభాగాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్పెయిన్, భారత్ సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలతోపాటు ‘ఎఫ్‌ఐసిసి-ఐఫా’ గ్లోబల్ ఈవెంట్ కూడా ఉంటుంది. అలాగే ఐఫా రాక్ కార్యక్రమంకూడా నిర్వహిస్తారు. మాడ్రిడ్‌లో ఐఫా వేడుక నిర్వహించడం ఇది తొలిసారి. ఈ వేడుకకు ఈసారి ప్రఖ్యాత బాలీవుడ్ తారలు ఫర్హాన్ అక్తర్, షాహిద్‌కపూర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తారు. సల్మాన్‌ఖాన్, ప్రియాంకచోప్రా, హృతిక్‌రోషన్, దీపిక పదుకొనె ప్రత్యేక కార్యక్రమాలతో ఆహూతులను అలరించనున్నారు. భారత్, స్పెయిన్ మధ్య దౌత్యసంబంధాలు ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా మాడ్రిడ్‌లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దీపికా పదుకొనే, అథియాశెట్టి, వివేక్‌ఒబెరాయ్, సుభాష్‌ఘాయ్, రమేష్‌సిప్పి, హృతిక్‌రోషన్, డెసిరుూషా, సోనాక్షిసిన్హా మంగళ, బుధవారాల్లో బయలుదేరి వెళ్లారు.