గుర్తుండిపోయేవి ప్రేమకథలే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక మనసు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని నేడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రామరాజు చెప్పిన విశేషాలు...

స్వచ్ఛమైనవి ప్రేమకథలే
ఓ స్వచ్ఛమైన ప్రేమకథను సినిమా చేయడానికి కారణం కథ నున్న బాగా ఎగ్జైట్ చేసింది. నమ్మకంతో చేసిన సినిమా ఇది. మనిషికి గుర్తుండిపోయేవి ప్రేమకథలే. చిన్నప్పటినుండి ప్రేమకథలు చూస్తూనే పెరిగాను. ఒకప్పుడు మనిషిని డబ్బు ప్రభావితం చేసేది. కాని ఇప్పుడు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవంగా జరుగుతున్నదానే్న హ్యూమన్ డ్రామాగా తెరకెక్కించాను.
మొదట సమంత అనుకున్నాను
కథ రెడీ చేసుకొని టీవీ9 వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఓ కమర్షియల్ ఫేస్‌తో సినిమా చేయాలనుకున్నాను. దానికోసం ముందుగా సమంతను హీరోయిన్‌గా అనుకున్నాం. తనకు కథ నచ్చింది కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అలానే రెజీనాను కూడా అనుకున్నాం. తనకూ అదే పరిస్థితి. కథను నమ్ముకొని సినిమా చేస్తున్నప్పుడు కమర్షియల్‌గా వెళ్లడం ఎందుకని భావించి, కొత్తవాళ్ళతో వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో మధురా శ్రీ్ధర్‌రెడ్డిగారు ఫోన్ చేసి నిహారిక అయితే మీ కథకు సెట్ అవుతుందా? అనడిగారు. నేను వెంటనే గూగుల్ సెర్చ్‌చేసి తన ఫొటోలు కొన్ని చూశాను. ఒక ఫొటోలో నేను సంధ్య పాత్రను చూశాను. తన ఫోటోలో ఆ ఇన్నోసెన్స్ నచ్చింది.
మొదట భయపడ్డా..
మొదట నిహారిక హీరోయిన్‌గా పెట్టాలనుకున్నప్పుడు భయపడ్డాను, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయనుకున్నాను. కానీ నిహారిక, సంధ్య పాత్రకు తగిన అమ్మాయని ధైర్యం చేశాను. సినిమా కథ నిహారికకు, తన తల్లిదండ్రులతో కలిసి చెప్పాలనుకున్నాను. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అక్కడితో వదిలేద్దాం అని, లేదా ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చని వివరంగా చెప్పాను. నిహారికకు కథ బాగా నచ్చింది. ఎంతగా అంటే సెట్‌లో ఉన్నప్పుడు నిహా అని పిలిస్తే పలికేది కాదు. సంధ్య అంటేనే పలికేది.
గ్యాప్ ఎందుకు వచ్చింది
‘మల్లెల తీరం’ సినిమా తరువాత నేను సంవత్సరంపాటు గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. సినిమా అంటే ఆర్ట్ కాదు వ్యాపారం అయిపోయింది. ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేసుకొని మరొక సినిమా చేయడానికి సమయం పట్టింది. రెగ్యులర్ సినిమాలు చేయడానికి నేను అవసరం లేదు. చాలామంది చేస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకథకు చాలా గ్యాప్ వచ్చింది. కానీ నిజాయితీగా చెప్తే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారు. తమిళ మార్కెట్‌ను పెంచింది కూడా మన తెలుగువాళ్లే. కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ డబ్బు ఖర్చుచేయడం కాదు. తక్కువ బడ్జెట్‌లో సినిమా చేసినా దానికి డబ్బు వస్తే అది అసలైన కమర్షియల్ సినిమా.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇదే చిత్ర నిర్మాతలతో నా తదుపరి సినిమా ఉంటుంది.

-యు