తను... వచ్చేనంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మిగౌతం, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను...వచ్చేనంట’. ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను, మోషన్ పోస్టర్‌ని చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఈ చిత్ర రచయిత మరియు నిర్మాత అయిన చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం లవ్ స్టోరీలతోపాటు హారర్, కామెడీ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. అలాగే మన ప్రేక్షకులు సెంటిమెంట్ కథల్ని కూడా బాగా ఆస్వాదిస్తారు. ‘జాంబి+కామెడీ= జమేడిజోనేర్’ సినిమా అంటే ఏంటో మా సినిమాతో తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాం. కథ, కథనం కొత్తగా వుంటాయి. ఈ సినిమాలో విజయ్ అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ అందించరా. రేష్మి పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇటీవల చేసిన షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో వుంది. ఇంకా మూడు పాటలు చిత్రీకరించాల్సి వుంది. త్వరలో ఈ పాటల్ని కూడా అందమైన లొకేషన్స్‌లో ఈనెల చివరి వారంలో తెరకెక్కిస్తాం. జూలై మూడవ వారంలో ఆడియో రిలీజ్ ప్రోగ్రాం గ్రాండ్‌గా చేద్దామని సన్నాహాలు చేస్తున్నాం. చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్, పాత్రలే ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం దర్శకుడు వెంకట్ కాచర్ల అనుక్షణం కష్టపడుతున్నారు. ఆర్టిస్ట్‌ల సహకారం చాలా బావుంది. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అని తెలిపారు. హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్లో అద్భుతమైన సినిమా అవుతుంది. ఈ సినిమాతోపాటు మరో 3 సినిమాలు చేస్తున్నాను. అందులో ఈ సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది’ అన్నారు.