బాహుబలి.. శ్రీమంతుడి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సినిమా పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో పేరున్న ఫిలిమ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో శనివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలకు సంబంధించి విడివిడిగా ప్రకటించే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హెచ్.ఐ.సి.సిలో నిర్వహించారు. సౌత్ ఇండియన్ సినిమాలోని నాలుగు సినీ పరిశ్రమల నుండి తారాగణం దిగి రాగా అంగరంగ వైభవంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగింది. సినీ తారల ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకలో తెలుగు సినిమాకు సంబంధించి గత సంవత్సరం విడుదలై, దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ కెమెరామెన్ లాంటి ఇతర విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని, ఈ వేడుకలో మొదటి స్థానంలో నిలిచింది. మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకత్వ విభాగాల్లో అవార్డులు అందుకుంది.
దాసరి, చిరుల కలయిక...
ప్రతిష్టాత్మకంగా జరిగిన 2016 ఫిలింఫేర్ అవార్డులలో దాసరి నారాయణరావు, చిరంజీవి అప్యాయంగా పలుకరించుకుని, ఒకరి విశేషాలు ఒకరు మాట్లాకోవడం ఆహూతులను ఆకట్టుకుంది. ఆ ఇద్దరు ప్రముఖుల మధ్య కొంతకాలంగా సయోధ్య లేదని అంతా భావిస్తున్న సమయంలో ఇలా కనిపించడం అందర్నీ ఆశ్ఛర్యపరిచింది. వీరిద్దరి మధ్య ఇప్పుడు సఖ్యత నెలకొనడంతో ఇది శుభపరిణామంగా పలువురు విశే్లషించారు. టాలీవుడ్‌కు సంబంధించిన హీరోలందరు వారివారి కుటుంబ సభ్యులతో ఈ వేడుకకు హాజరయ్యారు. అక్కినేని అఖిల్ తొలిసారిగా తొలిచిత్రంతోనే అవార్డు అందుకోవడం విశేషం కాగా మలయాళ హీరో మమ్ముట్టి ఈ కార్యక్రమానికి హాజరై హైలెట్‌గా నిలిచారు. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈసారి హీరోగా ఈ అవార్డు వేడుకలలో పాల్గొనడం విశేషం. రకుల్‌ప్రీతిసింగ్‌సహా పలువురు టాలీవుడ్ తారలు తమదైన సరికొత్త డ్రెస్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

ఉత్తమ చిత్రం: బాహుబలి
నటుడు: మహేష్‌బాబు (శ్రీమంతుడు)
దర్శకుడు: రాజవౌళి (బాహుబలి)
నటి: అనుష్క (రుద్రమదేవి)
సంగీత దర్శకుడు: దేవిశ్రీప్రసాద్ (శ్రీమంతుడు)
సహాయ నటుడు: అల్లు అర్జున్ (రుద్రమదేవి)
సహాయ నటి: రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ రచయిత: సిరివెనె్నల (రా ముందడుగేద్దాం-కంచె)
గాయకుడు: ఎం.ఎల్.ఆర్.కార్తికేయన్ (పోరా శ్రీమంతుడా-
శ్రీమంతుడు)
గాయని: గీతామాధురి (జీవనది- బాహుబలి)
కెమెరామెన్: కె.కె.సింథిల్‌కుమార్ (బాహుబలి)
కొరియోగ్రాఫర్: శేఖర్ (కుంగ్‌ఫు కుమారి - బ్రూస్‌లీ)
నటుడు (జ్యూరీ): నాని (్భలే భలే మగాడివోయ్)
నటి (జ్యూరీ): నిత్యామీనన్ (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు)
నూతన నటుడు: అఖిల్ (అఖిల్)
నూతన నటి: ప్రగ్యాజైస్వాల్ (కంచె)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: మోహన్‌బాబు