ద్విభాషా చిత్రంగా ఫుల్‌మూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, డాలీశర్మ, నదీమ్ భార్గవ్ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ రూపొందించిన చిత్రం ఫుల్‌మూన్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ, యువతకు నిండుచంద్రుడు అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం వారి జీవితాలలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది అనే కథనంతో ‘బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని సంగీతభరిత చిత్రంగా రూపొందించామని తెలిపారు. మూడు జంటల కథనంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిమ్లా, కసోల్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, నటీనటులు అందరూ కొత్తవారైనా బాగా నటించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అభిలాష్ గొలిడె, మాటలు:అశ్వినీసింగ్, కెమెరా:ఖన్నా, నిర్మాత:ప్రకాష్ ఠాకూర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దీపక్ బల్‌దేవ్.