అరకు రోడ్డులో సరికొత్త అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంశంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో నక్కా రామేశ్వరి, మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు సరికొత్తగా వుంటాయని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పూర్తి యాక్షన్ తరహాలో సాగే థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో తన పాత్ర బాగా వుందని, షూటింగ్ సమయంలో కథనం చూసి ఆశ్చర్యపోయానని కథానాయిక నికిషా పటేల్ తెలిపారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా రూపొందిందని, కథ సరికొత్తగా వుంటుందని, రాంశంకర్ కెరీర్‌లో ఓ హిట్‌గా నిలుస్తుందని దర్శకుడు వాసుదేవ్ తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత సురేష్ వర్మ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వాసుదేవ్.

చిత్రం నికిషా పటేల్