మోహినీ అవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల భామ త్రిష. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈమె, తాజాగా నటించిన ‘నాయకి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. త్రిష మరోమారు ప్రేక్షకులను భయపెట్టనుందట. తాజాగా మరో హర్రర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. మధురై ఫేం ఆర్.మాదేశ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈరోజు లండన్‌లో ప్రారంభమైందట. వైవిధ్యభరిత కథతో హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి ‘మోహిని’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో త్రిష మరో సంచలనానికి తెరతీస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. మొత్తానికి హర్రర్ సినిమాలతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునేందుకు మోహినీ అవతారం ఎత్తింది త్రిష.