గుణశేఖర్ ప్రతాపరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక చారిత్రక కథను సినిమాగా ఆవిష్కరించాలని గుణశేఖర్ చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచే కాక సినీ పరిశ్రమనుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తన కల ‘రుద్రమదేవిని’ని తెరపై ఆవిష్కరించిన గుణశేఖర్, అందుకు సీక్వెల్‌గా ‘ప్రతాపరుద్రుడు’ అనే సినిమాను కూడా సిద్ధం చేయనున్నట్లు అప్పట్లో తెలిపారు. ఈమధ్యే గుణశేఖర్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధన కూడా మొదలుపెట్టేశారు. కాకతీయ సామ్రాజ్యానికి కొత్త వైభవాన్ని తెచ్చిన రుద్రమదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తనదైన పంథాలో ఆ రాజ్యాన్ని పాలించిన ప్రతాపరుద్రుడి జీవిత కథగా ‘ప్రతాపరుద్రుడు’ సినిమా తెరకెక్కనుంది. ఇందుకోసం గుణశేఖర్ టీమ్ ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలనుంచి ప్రతాపరుద్రుడి సమాచారాన్ని సేకరిస్తోంది. స్క్రిప్ట్ మొత్తం తీర్చిదిద్దాకే ప్రతాపరుద్రుడి సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందట?