రాణిగారి బంగళా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధంచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు డి.దివాకర్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం అనేక రకాల పేర్లు అనుకున్నా, కథప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని నిర్ణయించామని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను రూపొందించామని, ఓ వెరైటీ కథ, కథనాలతో హారర్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించామని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కథ, కథనాలు హైలెట్‌గా రూపొందించిన రాణిగారి బంగళా ప్రతిఒక్కరికీ నచ్చుతుందని, శివకృష్ణ పోషించిన కాటికాపరి పాత్ర సినిమాలో కీలకంగా వుంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ప్రభాకర్‌రెడ్డి, ఎడిటింగ్:అనిల్ మల్నాడు, కథ:వి.లీనా, నిర్మాణం:వి సినీ స్టూడియో, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:డి.దివాకర్.