భావోద్వేగాల నాన్న నేను వర్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓం డి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శబాబు, పావని జంటగా అజ్మీర చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న నేను వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఓ సరికొత్త కథతో ప్రేక్షకులకు ఆసక్తికరమైన కథనంతో భావోద్వేగాల సమాహారంగా మూడు పాత్రలమధ్య ఈ చిత్రం సాగుతుందని, కథానాయకుడు కొత్తవాడైనా ప్రామిసింగ్ హీరో స్థాయిలో నటించాడని చెప్పారు. 12 గెటప్పుల్లో హీరో పరిచయం ఈ సినిమాకు హైలెట్‌గా వుంటుందని, అన్ని రకాల హంగులతో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. బస్ట్ఫా కోటేశ్వరరావు, చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, మంగూలాల్, సమీర, అక్షయ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:విశ్వత్ చందు, దాస్, ఆదిత్య, లక్ష్మణ్, సంగీతం:డేవిడ్, కెమెరా:డి.విజయకుమార్, ఎడిటింగ్:అనీల్‌రాజ్, నిర్మాత:ఎ.ఎస్.రావు, రచన, దర్శకత్వం:అజ్మీర చందు.