రాజవౌళి అడిగితే ఏ పాత్రైనా చేస్తా....... హీరోయిన్ లావణ్య త్రిపాఠి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘దూసుకెళ్తా’,‘్భలే భలే మగాడివోయ్’ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటిస్తోంది. ఈరోజు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ...
భలే భలే మగాడివోయ్ హిట్‌తో మంచి జోరుమీదున్నారు?
చాలా ఆనందంగా వుంది. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వస్తున్నాయి.
‘దూసుకెళ్తా’ చిత్రం
తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు?
ఆ సినిమా తరువాత అన్నీ ఆ తరహా పాత్రలతో వుండే కథలే చెప్పారు. నచ్చక అందుకే గ్యాప్ తీసుకున్నా. ఎపుడూ ఒకేరకమైన పాత్రల్లో నటిస్తే బోర్ కొట్టేస్తుంది కదా.
ఈ గ్యాప్‌లో ఏం చేశారు?
నాకు కథక్ అంటే ఇష్టం. అందుకే అది నేర్చుకున్నా. ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాలో కూడా కథక్ డాన్స్ సీన్స్ ఉన్నాయి.
నాగార్జునతో నటించడం ఎలా వుంది?
చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. ఆయనతో నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాలో సాంప్రదాయమైన అమ్మాయిగా కనిపిస్తాను. ఎక్కువగా చీరల్లోనే ఉంటాను. మంచి ఎమోషన్స్ వున్న సినిమా ఇది.
వరుసగా మూడు సినిమాలు
ఒకేసారి చేస్తున్నారు?
ఔను. లచ్చిందేవికి ఓ లెక్కుంది, అల్లు శిరీష్ సినిమాతోపాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాలు చేస్తున్నా.
లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమాలో
మీ పాత్ర?
ఈ సినిమాలో నేను మూడు విభిన్నమైన షేడ్స్ వున్న పాత్రల్లో కన్పిస్తాను. ముఖ్యంగా అంకాళమ్మ అనే పాత్ర చాలా వైవిధ్యంగా వుంటూ అందరినీ భయపెడుతుంది. క్రైం కామెడీతో సాగే సినిమా ఇది.
అల్లు శిరీష్ సినిమా గురించి?
అల్లు శిరీష్‌తో చేసే సినిమాలో కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా కనిపిస్తాను. డిఫరెంట్ పాత్ర అని చెప్పలేను కాని నా వరకు నేను విభిన్నంగా కన్పించడానికి ప్రయత్నించా.
‘బాహుబలి-2’ సినిమా కోసం
అడిగారట కదా.
లేదండీ. అవన్నీ రూమర్సే. ఆ సినిమా కోసం ననె్నవరకూ అడుగలేదు. ఒకవేళ రాజవౌళిగారు అడిగితే ఏ పాత్రలోనైనా నటిస్తా.
హీరోయిన్‌గా జర్నీ ఎలా వుంది?
చాలా ఆనందంగా వుంది. నా మొదటి సినిమా తరువాత అలాంటి పాత్రలే చేస్తానని అందరూ అనుకున్నారు. కానీ, నేను విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాను. నేననుకున్నట్టుగానే మంచి పాత్రలు వస్తున్నాయి.
సినిమా ఎంపికలో ప్రాముఖ్యత దేనికి?
సినిమాను సెలెక్టు చేసుకునే విషయంలో కథకే నా ప్రాధాన్యత. ఆ తరువాతే దర్శకుడు.
మరి డబ్బింగ్ చెబుతారా?
‘అందాల రాక్షసి’ సినిమాకు ప్రయత్నించా. కానీ కుదరలేదు. తప్పకుండా మళ్లీ ఛాన్స్ వస్తే చేయడానికి రెడీ.
తెలుగులో మీకు నచ్చిన హీరోలు?
తెలుగులో అందరు హీరోలు ఇష్టమే. అందరితో పనిచేయాలి. నాగార్జునగారితో సినిమా చేస్తున్నాను, ఆ తరువాత నాగచైతన్య, అఖిల్‌తో కూడా సినిమా చేయాలనుంది.
ఇతర భాషల్లో సినిమా చేయడం లేదు, కారణం?
ప్రస్తుతం నేను తెలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ కుదరడంలేదు.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
ఖాళీ సమయాల్లో టీవీ చూస్తాను. రాత్రి పూట ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతాను. హైదరాబాద్‌లో నైట్ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ సొంతిల్లు తీసుకోవాలని ఆలోచన కూడా వుంది.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ సినిమాకు సైన్ చేశాను. మార్చిలో ఆ సినిమా ప్రారంభం అవుతుంది. దాంతోపాటు రెండు మూడు కథలు వింటున్నా.

-శ్రీ