కరుణాకరన్‌తో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కరుణాకరన్ పేరు వినగానే గుర్తొచ్చేవి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీస్. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో మర్చిపోలేని ‘తొలిప్రేమ’ వంటి హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు, ‘డార్లింగ్’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి మంచి ప్రేమకథలను సినిమాలుగా రూపొందించాడు. ప్రస్తుతం కరుణాకరన్ హీరో రామ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. అయినా.. ఈసారి కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఓకె చెప్పినట్లు సమాచారం. దీంతో కరుణాకరన్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉన్నాడు. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ స్టోరీ అని సమాచారం. రామ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రామ్, కరుణాకరన్‌ల సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.