ప్రారంభమైన ఆనువంశికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్‌రాజ్, నేహాదేశ్‌పాండే జంటగా రమేష్ ముక్కెర దర్శకత్వంలో కౌండిన్య మూవీస్ పతాకంపై టి.దామోదర్‌గౌడ్ రూపొందిస్తున్న ‘ఆనువంశికత’ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశం శుక్రవారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి క్లాప్‌నివ్వగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం ఎం.పి. వినోద్‌కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత టి.దామోదర్ గౌడ్ మాట్లాడుతూ, మంచి కథ దొరకడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని, త్వరలో వరంగల్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభిస్తానని తెలిపారు. 12 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన తాను రూపొందించుకున్న కథ నిర్మాతకు చెప్పడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారని, బ్యూటీఫుల్ లవ్‌స్టోరీతో కామెడీ సెంటిమెంట్ మెసేజ్‌లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయని, మంచి బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు రమేష్ ముక్కెర అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన టెక్నీషియన్లు, నటీనటులతో ఈ సినిమా తెరకెక్కించడం శుభ పరిణామం అని స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. సినిమాలు వినోదంతోపాటు సందేశాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కథ విన్న తాను తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకంతో వున్నానని స్వామిగౌడ్ తెలిపారు. సాధారణంగా వున్న సమస్యలను తీసుకుని ప్రజలకు ఓ సందేశం ఇచ్చేలా రూపొందిస్తున్న సినిమా అందరికీ నచ్చుతుందని ఎం.పి. వినోద్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో సంతోష్ రాజ్, నేహా దేశ్‌పాండే, రామకృష్ణగౌడ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:అడుసుమిల్లి విజయ్, కథ, మాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రమేష్ ముక్కెర.