ఆ సంగతి తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ చిత్రంతో మరో హిట్ కొట్టిన రాశిఖన్నా కెరీర్ జోరుమీదుంది. ఈ చిత్రం విజయంతో నటిగా, గ్లామర్ డాల్‌గా మరింత లైమ్‌లైట్‌లోకొచ్చింది. బెల్లం శ్రీదేవిగా ఆమె నటనకు మార్కులు పడుతున్నాయి. అయితే ఇటీవల ఆమెపై పలు కామెంట్స్ వస్తున్న విషయంపై నోరు మెదపడం లేదు రాశిఖన్నా. ఆమె శరీరం రోజురోజుకి పెరుగుతోందని, ఆకర్షణీయంగా ఉండడం లేదని, గ్లామర్‌గా కనబడడం లేదని పలు కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో వాటిపై పెదవి విప్పింది రాశిఖన్నా. నాపై వచ్చిన అనేక కామెంట్స్‌ను నేను వింటూనే ఉన్నానని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. కేవలం మన శరీరానే్న నిరంతరం కాపాడుకోవడం అన్నమాట దురదృష్టకరమైనదని, తానేం చేస్తున్నానో తనకు తెలిసే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఒక నటిగా నేనేమి చేయాలో అదే చేస్తాను కానీ, అనవసరమైన వాటిని పట్టించుకొని, కామెంట్స్ చేసేంత తెలివి లేనిదాన్ని కానని అంటోంది. ప్రస్తుతం తన కెరీర్ మంచి పీక్స్‌లో ఉంది కనుక అందుకు తగిన విధంగానే నేను నా శరీరాన్ని ఫిట్‌గానే పెట్టుకున్నానని అంటోంది ఈ అందాల భామ!