కేన్స్‌లో అలరించిన అవిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నితెరపై సంచలనం సృష్టించిన ‘బాలికావధు’ (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో నటించి దేశమంతటా ప్రేక్షకుల మనసుదోచిన నటి అవికాగోర్ తెలుగుప్రేక్షకులకూ పరిచితమే. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్రాన్స్‌లోని కేన్స్ నదీతీరంలో జరుగుతున్న చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. మూడురోజులుగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ఫ్రెంచ్ భాషలో రూపొందిన ‘జస్టె ల ఫిన్ డు మోండి’ (ఇటీస్ ఓన్లీ ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఆమె తోటి బుల్లితెర నటుడు మనీష్‌తో కలసి రెడ్‌కార్పెట్‌పై అందాలు ఒలికించింది. భారతీయ సంప్రదాయ రీతిలో అభివందనం చేస్తూ, ఉంగరాలు తిరిగిన కురులతో, ప్రఖ్యాత డిజైనర్ రోజిని విష్రామ్ రూపొందించిన ముదురు నీలి రంగు గౌనులో ఆమె మెరిసిపోయింది. మనీష్ రామ్‌సింఘానీతో కలసి ఆమె రూపొందించిన లఘుచిత్రం ‘ఆంకే బాతిన్’ ట్రైలర్, పోస్ట్‌ర్‌ను ఇక్కడ ప్రదర్శించారు. ఈ లఘుచిత్రానికి ఆమె క్రియేటివ్ డైరక్టర్‌గా వ్యవహరించింది. మనీష్, బార్క్‌బిస్తి నటించిన ఈ లఘుచిత్రం కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘షార్ట్ ఫిల్మ్ కార్నర్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.