రాణిగారి బంగళాలో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ- ఈ సినిమా కోసం అనేక పేర్లను పరిశీలించి చివరికి ఈ పేరైతేనే కథనానికి సరిపోతుందని తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి కెమెరా పనితనం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో రాణిగారి బంగళా నేపథ్యంగా కథనం సాగుతుందని, ఆ బంగళాలో ఎవరున్నారు అనేది ముఖ్యమైన అంశమని తెలిపారు. శివకృష్ణ కాటికాపరిగా ఈ సినిమాలో నటించారని, ఆయన పాత్ర హైలెట్‌గా వుంటుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ప్రభాకర్‌రెడ్డి, ఎడిటింగ్:అనిల్ మల్నాడు, కథ:వి.లీన, సమర్పణ:బాలాజీ నాగలింగం, నిర్మాతలు:వి సినీ స్టూడియోస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:డి.దివాకర్.