అనసూయ..ఆనంద్ వచ్చేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 2న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా తొలిసారిగా నటిస్తున్నారని, ఓ అందమైన కథతో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేనెల 2న ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, మిక్కీ జె మేయర్ అందించిన పాటలు హిట్ అయినట్టుగా సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం వుందని ఆయన చెప్పారు. అనుపమ పరమేశ్వరన్, నదియా, ఈశ్వరిరావు, అనన్య, సన, గిరిబాబు, నరేష్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నటరాజ సుబ్రహ్మణ్యం, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్.