త్వరలో రానున్న క్రీస్తు యేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఎస్‌ఆర్ ప్రధాన పాత్రలో ఎస్.ఆర్.కుమార్‌రాజా దర్శకత్వంలో పార్వతమ్మ రూపొందించిన చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- చారిత్రాత్మక చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం బైబిల్ ఆధారంగా కథ, మాటలు రూపొందించామని, పెద్దవాళ్లని గౌరవించాలని, ఏ దేశంలో వుంటే ఆ దేశాన్ని గౌరవించాలన్న క్రీస్తు బోధనలే ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా సాగుతాయని తెలిపారు. ఎక్కడా రాజీపడకుండా రూపొందించిన ఈ చిత్రం చూసిన ప్రతి క్రీస్తు భక్తుడు ఆనందిస్తాడని, క్రీస్తు బోధనలే చిత్రంలో అందరికీ నచ్చుతాయని, ముఖ్యంగా పాటలు ప్రతివారిని ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. లక్ష్మి, శాంసన్, సంగాల కిరణ్‌కుమార్, జయరాజ్, చెరుకూరి సాంబశివరావు, పడాల ప్రసాద్, కత్రిన, దీప తదితరులు నటించారు.