శ్రీయ అంతంలేని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంత్ మూవీ క్రియేషన్స్ పతాకంపై దాసరి గంగాధర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘అంతంలేని కథ’ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. లేడీ ఓరియంటెడ్ కథాకథనాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ ప్రధాన పాత్రలో నటించనున్నదని సమాచారం. ఈ సందర్భంగా దాసరి గంగాధర్ మాట్లాడుతూ, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథ సరికొత్తగా ఉంటుందని తెలిపారు. భారీ తారాగణంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభిస్తున్నామని, ఆసక్తికరమైన సన్నివేశాలతో, నేపథ్య సంగీతం హైలెట్‌గా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, తెలుగు తమిళ భాషల నటీనటులు నటించనున్న ఈ చిత్రంలో మహిళా సమస్యలను గూర్చి చర్చించనున్నామని ఆయన అన్నారు. పశుపతి, భానుచందర్, దేవన్, నిల్‌గళ్ రవి, వడివుక్కరసి, తిరునావు, సీత, కాంచన, శరణ్య్, హేమ, బాబుమోహన్, తా.రమేష్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.బి.జాన్, సంగీతం: డి.ఇమామ్, ఎడిటింగ్: శంకర్, మాటలు: బాసిన వీరబాబు, నిర్మాణం: వసంత్ మూవీక్రియేషన్స్, దర్శకత్వం: దాసరి గంగాధర్.