27న అడవిలో లాస్ట్‌బస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాష్, మానసాజోషి, రాజేష్ ప్రధాన తారాగణంగా శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.డి.అరవింద్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అడవిలో లాస్ట్‌బస్’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను సినిమా సమర్పకురాలు పూజశ్రీ తెలుపుతూ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని, గత సంక్రాంతికి కన్నడంలో విడుదలై ఘన విజయం సాధించిందని తెలిపారు. లంబసింగి నుండి అరకు వెళ్లే ఆఖరి బస్‌లో ఏం జరిగింది? అనే నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఈ సినిమా రూపొందిందని, అనువాద కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 27న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అనంత అరసు, మాటలు: నందు తుర్లపాటి, పాటలు: రాకేందువౌళి, వెనె్నలకంటి, సంగీతం, దర్శకత్వం: ఎస్.డి.అరవింద్.