ఏంజిల్‌గా కుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలా ఎలా’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన హెబా పటేల్‌కు సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమాలో బోల్డు పాత్రలో నటించిన ఆకట్టుకున్న హెబాకు ఆ తరువాత అవకాశాలు క్యూకట్టాయి. తాజాగా రాజ్‌తరుణ్ సరసన నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న హెబాకు ఇటీవలే మెగా కాంపౌండ్‌లో ఛాన్స్ దక్కింది. వరుణ్ తేజ్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని చెబుతున్నారు. దీంతోపాటు ‘వినవయ్యా రామయ్యా’ ఫేం నాగ అనే్వష్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. రాజవౌళి శిష్యుడు పళని దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించే ఈ చిత్రానికి ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను ఓకె చేశారు. త్వరలోనే మిగతా వివరాలు ప్రకటించనున్నారు. కుమారిగా క్రేజ్ తెచ్చుకున్న హెబా, ఏంజిల్‌గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

చిత్రం హెబా పటేల్