సరోజ ఏంచెబుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అయాన్, కాంచన ప్రధాన తారాగణంగా ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ- సమాజంలో స్ర్తి పరిస్థితి ఎలా వుంది అన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, స్ర్తిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు, దాడుల నేపథ్యంలో రూపొందించుకున్న ఈ కథలో అనేకమంది యధార్థ కథనాలు వున్నాయని తెలిపారు. ఓ ఆడది ఆడదానిగా బతకలేకపోతే ఈ సమాజం చెప్పే జవాబు ఏంటి అని ఈ సినిమా ప్రశ్నిస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ధన్‌రాజ్, విజయ్‌భాస్కర్, డి.వి.శ్రీను, ఆనంద్, రాజేష్, కృష్ణవేణి, మమత, జ్యోతి, వౌనిక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:నాగేంద్ర కుమార్, సంగీతం:నంద కిశోర్, దర్శకత్వం: ప్రసాద్‌రెడ్డి.