మెగా ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ కాథరీన్‌కు ఆ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా కూడా తెలుగులో ఆశించిన గుర్తింపు దక్కలేదు. తాజాగా ‘సరైనోడు’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు మెగా ఛాన్స్ దక్కింది. చిరంజీవి హీరోగా నటించే 150వ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక హీరోయిన్‌గా అనుష్క నటిస్తుందని వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్‌గా కాథరీన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో ఈమెకు కీలకపాత్ర దక్కిందని చిరంజీవితో స్టెప్పులు వేసేందుకు సిద్ధమవుతోంది.

చిత్రం కాథరీన్