జులైలో కబాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా వి క్రియేషన్స్ పతాకంపై పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.్థను రూపొందిస్తున్న ‘కబాలి’ చిత్రం జూలై మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ రావడం ఆనందంగా వుందని, ప్రస్తుతం ఆడియో విడుదల జరపనున్నామని, జూన్ మొదటివారంలో పాటలను, జూలై 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ మనసుపెట్టి టైలర్‌మేడ్ లాంటి పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుతున్నామన్నారు. ధన్సిక, కిషోర్, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మురళి, సంగీతం:సంతోష్ నారాయణ్, మాటలు:సాహితి, పాటలు:సిరివెనె్నల, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, నిర్మాత:కలైపులి ఎస్.్థను, దర్శకత్వం:పా.రంజిత్.