రామన్ రాఘవ్ 2.0కు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబైలో 1960లో వరుస హత్యలకు పాల్పడిన సైకోకు సంబంధించిన కథతో అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రం యూనిట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేన్స్‌లో జరుగుతున్న 69వ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్ధిఖి సహా చిత్రం యూనిట్ సభ్యులు స్క్రీనింగ్ అనంతరం వేదికపైకి వచ్చినప్పుడు ఆహూతులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఓ భారతీయ సినిమాకు కేన్స్‌లో ఇలా స్టేండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. నిజానికి కేన్స్‌కు హాజరవడం నవాజుద్దీన్ సిద్ధిఖికి కొత్తేమీ కాదు. గత నాలుగేళ్లుగా ఆయన ఇక్కడికి వస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన 8 సినిమాలు కేన్స్‌లో ప్రదర్శించారు. ‘లంచ్‌బాక్స్’, ‘గాంగ్స్ ఆఫ్ వస్సేపుర్’, ‘మిస్ లవ్‌లీ’, ‘లయర్స్ డ్రెస్’, ‘మియాన్ కల్ ఆనా’ వాటిలో ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆయన నటించిన ‘రామన్ రాఘవ్ 2.0’ను చూసిన హాలీవుడ్ ప్రముఖులంతా అభినందనలతో ముంచెత్తడం విశేషం.

చిత్రం నవాజుద్దీన్ సిద్ధిఖి