వేశ్య పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హీరోయిన్స్‌కు వేశ్యపాత్రలంటే బాగా ఆసక్తి. గ్లామర్ హీరోయిన్‌గా కన్నా కూడా ఈ తరహా పాత్రల్లో నటించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం- ఆ పాత్రలో నటనకు స్కోప్ వుండడంతోపాటు జనాల్లో బాగా సింపతీ వుంటుంది. కాబట్టి ఈ తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన నటీమణులు నాటి తరం నుంచి నేటితరందాకా ఉన్నారు. తాజాగా వేశ్యపాత్రలో నటించేందుకు రెడీ అయ్యింది గ్లామర్ భామ ఆండ్రియా. కమల్ సరసన ‘విశ్వరూపం’ సినిమాలో నటించిన ఈ భామ, ప్రస్తుతం ‘తరమణి’ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు ధనుష్ హీరోగా నటించే ‘వడ చెన్నై’ అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది ఆండ్రియా. కథకు కీలకమైన వేశ్య పాత్ర కావడంతో నటిస్తోందట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా చెన్నైనుండి నార్త్ ఇండియాలో సెటిల్ అయిన వారి జీవిత కథతో వుంటుందని, జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆండ్రియా మరి వేశ్య పాత్రతో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

చిత్రం ఆండ్రియా