ఎవరీ రోడ్‌సైడ్ ఉస్తాద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం రద్దీగా ఉండే ముంబైలోని జుహూ వీధిలో ఓ చెట్టుకింద హార్మోనియం పెట్టెతో కూర్చున్న ఈ వ్యక్తి మధురంగా పాటలు ఆలపిస్తూ తనను తాను మరిచిపోయాడు. మాసిన గడ్డం, నెరిసిన జుత్తు, నలిగిన దుస్తుల్లో నిండా పేదరికంతో మగ్గిపోతున్న ఈ బిచ్చగాడి రూపం ఎలా ఉన్నా అతడు పాడిన పాటలు విని దారినపోయేవారు ఓ నిమిషం ఆగి..మళ్లీ బిజీలైఫ్‌లోకి పరుగులు తీశారు. ఒకరిద్దరు ఆ పాటలకు పరవశం చెంది టిఫిన్ చేయమంటూ కొంత నగదు ఇచ్చారు. ఓ వృద్ధుడైతే రూ. 12 రూపాయలు ఇచ్చి పాటలు బావున్నాయంటూ మెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ బిచ్చగాడిలా కన్పిస్తున్న గాయకుడు ఎవరో గుర్తుపట్టారా?. ‘అభి ముఝె మె కహిన్’ పాటను పాడిందెవరో గుర్తుందిగా. బాలీవుడ్‌తోసహా పలు భాషల్లో తనదైన గాత్రంతో చెరగని ముద్రవేసిన సోను నిగమ్. ఇప్పుడు ఈ చెట్టుకింద కూర్చున్నది కూడా అతడే. ఇదేదో సినిమాకోసం చేసినదికాదు. సామాన్య జనానికి సంగీత మధురిమను తెలియచేసేందుకు ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో సోనూ ఇలా పాలుపంచుకున్నాడు. బీయింగ్ ఇండియన్ అనే కానె్సప్టుతో ‘కల్చర్ మెషీన్స్ డిజిటల్ ఛానల్’ రూపొందించిన ఓ ఆన్‌లైన్ వీడియోకోసం సోనూ ఇలా ముంబై వీధుల్లో దర్శనమిచ్చాడు. బిజీలైఫ్‌నుంచి కాస్త ఉపశమనంకోసం ఇలా రోడ్డుమీదకొచ్చానని చెబుతున్న సోనూ...‘ననె్నవరూ గుర్తుపట్టలేదు. మేకప్ అంత చక్కగా ఉంది. నేను ఈ అనుభవాన్ని ఆస్వాదించా. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు కొన్న హార్మోనియంపై ఇక్కడ ఇలా పాటలు పాడటం ఓ అందమైన అనుభవం’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కాగా సోనూ ప్రయత్నానికి బాలీవుడ్‌నుంచి ప్రశంసలు ముంచెత్తాయి. గతంలో బాలీవుడ్ తారలు కల్కి కొచిలిన్, రాధికాఆప్టేలతో కూడా ఈ ఛానల్ విభిన్నమైన కార్యక్రమాలను రూపొందించింది.