త్వరలో రానున్న ఒక్క అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల చివరి వారంలో విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బోగాది అంజిరెడ్డి మాట్లాడుతూ, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని, సందీప్ కిషన్ కెరీర్‌లో మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాలో గంట పాటు సి.జి కార్యక్రమాలు ప్రేక్షకులకు నచ్చుతాయని, సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై జరుగుతుందని, అక్కడ షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌వేసి మిగతాదంతా గ్రాఫిక్స్‌లోనే చేశామని దర్శకుడు రాజసింహ అన్నారు. నిత్యామీనన్ నాలుగు గంటలపాటు కథ విని ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చారని, అందరిన్నీ ఈ సినిమా నవ్వించి ఎంటర్‌టైన్ చేస్తుందని ఆయన తెలిపారు.