ఉత్కంఠభరితంగా ఉందా..లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్‌పై శివ ప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉందా.. లేదా?’ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌కొట్టగా.. ప్రతాని రామకృష్ణగౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి ఎందరో దర్శక నిర్మాతలు వస్తున్నారని, వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయని, అదేవిధంగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు శివప్రసాద్ మాట్లాడుతూ, సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఇదొక కొత్త వెర్షన్ సినిమా అని, రొటీన్‌కు భిన్నంగా వుంటుందని, స్క్రీన్‌ప్లే బేస్డ్ ఫిల్మ్, ప్రేమకథ కూడా వుంటుందని, ఖచ్చితంగా అందరినీ ఎంటర్‌టెయిన్ చేస్తుందని చెప్పారు. నిర్మాత కమల్ మాట్లాడుతూ, ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుందని, మే చివరివారంనుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. రామకృష్ణ, అంకిత మాట్లాడుతూ, స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిచే ఈ కథలో ఇంటర్వెల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని, నెక్ట్స్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది అని చెప్పారు.