శరవేగంగా షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడిగా అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రామ్‌చరణ్ ఈ పాత్రలో బాగా కష్టపడి నటిస్తున్నాడని, తనని తాను డిఫరెంట్ లుక్‌లో ప్రేక్షకులను అలరించాలని ఈ సినిమాతో ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అరవింద్‌స్వామి పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని, ఈ నెల 22నుండి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటుగా యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నామని తెలిపారు. కాశ్మీర్‌లో కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని ఆయన తెలిపారు. యాక్షన్‌పార్ట్‌ను గ్రాండియర్‌గా షూటింగ్ చేస్తున్నామని ఆయన వివరించారు.