సోనమ్... ఆల్ ది బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ ఉత్పత్తుల సంస్థ లారియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ ఈసారి కేన్స్‌లో అంతా కలసివస్తుందంటున్నాడు ఆమె తండ్రి, బాలీవుడ్ అలనాటి నటుడు అనిల్‌కపూర్. ఇప్పటికే కేన్స్ చేరుకున్న సోనమ్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పాడు. ‘కేన్స్-2016 నీకు ఎంతో బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు. లారియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు ఐదుసార్లు కేన్స్‌కు హాజరైన సోనమ్ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను సాధించింది. ఇప్పుడు ఆరోసారి కేన్స్‌కు హాజరైన ఆమె సోమ, మంగళవారాల్లో రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనుంది. బాలీవుడ్ తారలు ఐశ్వర్య, కత్రినాకూడా లారియల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.