మళ్లీ మెరిశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలో మరోసారి మెరిశారు. ఈనెల 11న ప్రారంభమైన ఈ చిత్రోత్సవంలో ఇప్పటికి మూడుసార్లు రెడ్‌కార్పెట్‌పై ప్రత్యక్షమైన అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట కువైట్ డిజైనర్ అలీ యూనిస్ రూపొందించిన పసిడివర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది. ఆ తరువాత ఎన్‌ఆర్‌ఐ డిజైనర్ నరుూంఖాన్ రూపొందించిన ఎర్రటి దుస్తుల్లో మిలమిల మెరిసింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినీ దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన ‘ది బిఎఫ్‌జి’ చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించిన సందర్భంగా రెడ్‌కార్పెట్‌పై ఐష్ మరోసారి దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన హాలీవుడ్ తార బ్లాక్ లైవ్‌లీతో కలసి రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. ఈ కార్యక్రమానికి స్పీల్‌బర్గ్‌తోసహా ఆ చిత్రం యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఐష్ బంగారువర్ణపు దుస్తుల్లో మెరిసిపోతే మరోతార మల్లికాషెరావత్ రజతకాంతులీనిన డ్రెస్‌తో మెరిసిపోయింది. కేన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకసారి రెడ్‌కార్పెట్‌పై సందడి చేసిన మల్లిక మూడోరోజూ మళ్లీ దర్శనమిచ్చింది. ప్రఖ్యాత డిజైనర్ జార్జెస్ హొబెకా రూపొందించిన డ్రెస్‌లో ఆమె కొత్తగా కన్పించి ఆహూతులను అలరించింది. చైనీస్ చిత్రం ‘ది రైడర్’లో నటిస్తున్న మల్లిక కేన్స్‌లో ఆ చిత్రం ప్రమోషన్‌లో కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన మరోతార సోనమ్‌కపూర్ ఇప్పటికే కేన్స్ చేరుకుంది. ఆమె సోమవారంనాడు రెడ్‌కార్పెట్‌పై దర్శనమివ్వనుంది.