నిత్యామీనన్ జతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో విజయవంతమైన ఉస్తాద్‌హోటల్ చిత్రాన్ని తెలుగులో జతగా అనే పేరుతో అనువదిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జతగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రషీద్ అన్వర్, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో కథాకథనాలు సరికొత్తగా ఉంటాయని, ముఖ్యంగా దుల్కర్, నిత్యామీనన్‌ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. లవ్ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో పేద ధనిక వర్గాల మధ్య వుండే బేధాలు, సమానమైన అంశాలు చర్చించారని తెలిపారు. ఫీల్‌గుడ్ మూవీగా కమర్షియల్ విలువలతో రూపొందించిన ఈ చిత్రానికి సాహితి సంభాషణలు అందిస్తున్నారని, గోపీసుందర్ స్వరపరచిన పాటలన్నీ హిట్టయ్యాయని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.లోకనాథం, దర్శకత్వం: అన్వర్ రషీద్, నిర్మాత: సురేష్ కొండేటి.