సీతాదేవి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందిస్తున్న చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ఆడియోను ఎం.ఎస్.రాజు, పాశం యాదగిరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిగ్ సీడీని విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని ఎం.ఎస్.రాజు విడుదల చేసి యాదగిరిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ, సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథనంతో సాగే ఈ చిత్రంలో సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు. రణధీర్, సందీప్‌లు ఈ చిత్రాన్ని తమ చిత్రంగా అనుకుని నటించారని, తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. ఈ సినిమాలో ఆణిముత్యాల్లాంటి నాలుగు పాటలు ఉన్నాయని, అందరికీ నచ్చుతాయని, సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత అన్నారు. ఓ మంచి కథకు అందమైన కథనాన్ని జోడించి ఫీల్ గుడ్ మూవీగా రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని హీరోలు సందీప్, రణధీర్ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. జీవా, వెనె్నల కిశోర్, గుండు హనుమంతరావు, అంబటి శ్రీను, ధన్‌రాజ్, చిత్రం శ్రీను, విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:చైతన్య రాజా, నిర్మాత:చిటుకుల సందీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీనివాస్ మల్లం.