అభినేత్రి పాటలో అమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవ, తమన్నా, అమీ జాక్సన్ ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పరిచయ పాట ఆర్‌ఎఫ్‌సిలో భారీ సెట్టింగులమధ్య చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ- నాలుగు రోజులపాటు ఈ పాటను చిత్రీకరిస్తామని, ఈ పాటలో ఎలీమీ జాక్సన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని, 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వుంటుందని తెలిపారు.
అభినేత్రిగా తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవ పరిచయ పాటను ఇక్కడ చిత్రీకరిస్తున్నామని, ఈ పాట సినిమాకే హైలెట్‌గా వుంటుందని నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ అన్నారు. సోనూ సూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృధ్వీ, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా:మనీష్ నందన్, ఎడిటింగ్:ఆంథోని, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:విజయ్.

చిత్రం అమీ జాక్సన్