కేన్స్‌కు ఐష్..సోనమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సినీ సంబరం కేన్స్ ఫిలిమ్‌ఫెస్టివల్‌కు బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్ ఈసారికూడా హాజరవుతున్నారు. ఇప్పటికే సోనమ్ కేన్స్ చేరుకోగా ఐశ్వర్యరాయ్ గురువారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన కుమార్తె ఆరాధ్య, తల్లి బృందతో కలసి ఆమె వెళ్లారు. కాగా ఐశ్వర్యరాయ్ ఇప్పటివరకు వరుసగా 15 సంత్సరాలుగా కేన్స్ చిత్రోత్సవానికి వెళ్లడం, రెడ్‌కార్పెట్‌పై హొయలొలికిస్తూనే ఉన్నారు. మరో తార సోనమకపూర్ వరుసగా ఆరో సంవత్సరం కేన్స్ చిత్రోత్సవానికి హాజరవుతున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో ఆమె రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనున్నారు. కాగా ఆమెకు అరుదైన గౌరవం ఈసారి దక్కింది. ఎయిడ్స్‌పై పోరాటానికి ఉద్దేశించిన పరిశోధనలకు గాను నిధుల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొనే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత ప్రతిష్టాత్మకంగా సినీరంగ ప్రముఖులు భావిస్తారు. ‘ఎఎంఎఫ్‌గాలా’ పిలిచే ఈ కార్యక్రమంలో ఈసారి సోనమ్‌కపూర్ పాల్గొంటారు. తనకు ఈ అవకాశం రావడంతో ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సోనమ్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈనెల 19న జరిగే గాలాలో సోనమ్ ప్రసంగిస్తారు. కాగా ఐష్ గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ వివిధ కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉండటంతో ఈసారి గాలాకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ తార మల్లికాషెరావత్ కేన్స్ తొలిరోజు రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్న విషయం తెలిసిందే. మరోవైపు కేన్స్ ఉత్సవాల్లో రెండోరోజు హాలీవుడ్ తారలు పెద్దసంఖ్యలో రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు.

చిత్రం కేన్స్ రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ తార జూలియెనె్నమూర్