24 సీక్వెల్ ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24

దర్శకుడు విక్రం కె.కుమార్

‘13బి’, ‘ఇష్క్’, ‘మనం’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు విక్రం కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. మే 6న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర దర్శకుడు విక్రం కె.కుమార్‌తో ఇంటర్వ్యూ...

‘24’కు రెస్పాన్స్ ఎలా వుంది?
చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని తెరపై చక్కగా చూపెట్టాం. ఈ సినిమా ప్రారంభం నుండి ఓ ఎగ్జైట్‌మెంట్ విషయాన్ని చెబుతున్నామని తెలుసు. పెద్దలతోపాటు పిల్లలు కూడా సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.
ఈ కథను సూర్య ఎలా ఓకె చేశాడు?
సూర్య ‘మనం’ సినిమా తమిళంలో రీమేక్ చేద్దామని పిలిపించారు. సూర్య దగ్గరికి వెళ్లినప్పుడు ‘మనం కథ కాదు, నా దగ్గర వేరే కథ ఉంది. అది వినండి, నచ్చితే చేద్దాం.. లేదంటే ‘మనం’ సినిమా ఎలాగూ ఉందిగా’ అని చెప్పాను. కథ వింటున్నప్పుడు, ఆత్రేయ పాత్ర గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో భావాలు మారిపోయాయి. కథ మొత్తం విని మనం చేద్దామని అన్నారు.
కథ జనాలకు కనెక్ట్ అవుతుందని అనుకున్నారా?
మన చేతిలో లేని టైంను మార్చే అవకాశం మనకు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సాగే ఫిక్షన్ కథ ఇది. తప్పకుండా జనాలకు ఓ ఆసక్తి ఉంటుంది అనిపించింది. అలాగే సినిమాలో ప్రతి విషయాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. కథలో హీరోకు వాచ్ దొరికినపుడు దానితో ఏం చేయవచ్చు అనే విషయాలను చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏదో వాచ్ దొరికిందిగా, ఏదో చేయవచ్చు.. అన్నట్లు చెబితే ఆసక్తి తగ్గిపోతుంది. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అనేది అంటే ఆ వాచ్‌ను ఎమోషనల్ సీన్స్‌కు ఎలా కనెక్టు చేయాలి.
అన్నీ విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు?
చెప్పిన కథ మళ్లీ మళ్లీ చెబితే బోర్ కొట్టేస్తుంది. సినిమాను ఒకే స్టైల్‌లో చేసుకుంటూ వస్తే బోరింగ్‌గా అనిపిస్తుంది. డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు చేయడంవల్ల కొత్త సీన్స్ రాసుకోవచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. టైం గురించి చాలామంది చాలా రకాలుగా రాశారు. 24 సినిమాలో నేను చెప్పిన పాయింట్ నా స్టైల్లో సింపుల్‌గా చెప్పాను. మన ఆడియెన్స్‌కు నచ్చేలా ఉండాలి కాని ఇంగ్లీష్ సినిమాల తరహాలో ఉండకూడదని అనుకుంటాను.
24 సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
24 సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందండీ. ఆల్రెడీ రాయడం స్టార్ట్ చేశాను. ప్రీక్వెల్ చేయడానికి కారణమేమంటే ఆత్రేయ ఆ వాచ్‌ను ఎందుకు పొందాలనుకుంటాడనే పాయింట్ నుండి సినిమాను స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్పిన కథకు ముందు ఏం జరిగిందనే దాన్ని సినిమాగా ప్రీక్వెల్‌లో చూపిస్తాను.
సమంత, నిత్యామీనన్ మీకు లక్కీ హీరోయిన్సా?
వందశాతం అవుననే అంటాను. అయితే అంతకంటే ముందు వారిద్దరూ వండర్‌ఫుల్ నటీమణులు. ఇద్దరితో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడతాను.
తదుపరి చిత్రాలు
నేను ‘ఇష్టం’ సినిమాతో దర్శకుడిగా మారాను. చిన్న బ్రేక్ తీసుకున్నా కానీ నాకు తెలుగు సినిమానే ముఖ్యం. అల్లు అర్జున్‌తో నా తదుపరి చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే మహేష్‌బాబుకి కూడా చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. బహుశా అది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వస్తుంది. వాళ్ళిద్దరితో నా నెక్ట్స్ మూవీస్ ఉంటాయి. బాలీవుడ్‌లో కూడా అడుగుతున్నారు కానీ తెలుగులోనే సినిమాలు చేస్తా.

- శ్రీ