కాలేజీ నేపథ్యంలో స్టూడెంట్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యకృష్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ.వి. కథానాయకుడిగా గూన అప్పారావు దర్శకత్వంలో వి.కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ పవర్’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ- ‘కాలేజీ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుంది. ఓ ఊరిలోని దేవాలయంలాంటి కాలేజీని స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ప్రిన్సిపాల్ సహాయంతో తమ కాలేజీని స్టూడెంట్స్ ఏ విధంగా కాపాడుకుంటారనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించాం’ అని చెప్పారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ- ఓ యధార్థ సంఘటన ఆధారంగా రాజమండ్రి, యానం, పోలవరం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిపామని, మే నెల రెండో వారంలో ఆడియోను, జూన్ నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కృష్ణ.వి, శ్రీజ, పూర్ణి, కాశీవిశ్వనాథ్, ఆకెళ్ళ, జూ.రేలంగి, చిట్టి బాబు, శ్రీమన్మథ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం:ప్రవీణ్, కెమెరా:డి.వీర్రాజు, సహ నిర్మాత:పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:పాకలపాటి వీర్రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: రాజ్‌కమల్, నిర్మాత:వి.కృష్ణప్రసాద్, దర్శకత్వం:గూన అప్పారావు, సమర్పణ:మాస్టర్ వి.రాజ్‌కమల్.