విశాల్ తో తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తమన్నా, తాజాగా విశాల్ హీరోగా నటించే ‘కత్తి సందై’ అనే సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. విశాల్ స్టైల్లో సాగిపోయే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్లగా, నేటినుంచి తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఈరోజే సెట్స్‌లో జాయిన్ అయ్యానని తెలుపుతూ తమన్నా తన ఆనందాన్ని పంచుకున్నారు. జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక తమన్నా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ‘అభినేత్రి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.